Tuesday, May 7, 2024

Breaking : సరస్సులో కూలిన విమానం.. 26మందిని కాపాడిన సహాయక సిబ్బంది

విక్టోరియా సరస్సులో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం ఆఫ్రికా దేశం టాంజానియాలో చోటుచేసుకుంది. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో, ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది 26 మందిని కాపాడారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్థానిక మత్స్యకారుల సాయంతో విమాన ప్రయాణికుల కోసం గాలిస్తున్నారు. తోక భాగం మినహా విమానం మొత్తం సరస్సులో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement