Sunday, May 12, 2024

ఆ వెబ్ సిరీస్ ఆపాలంటూ నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు

‘బాంబే బేగమ్స్’ వెబ్ సిరీస్ బాలల హక్కులకు భంగం కలిగించేలా ఉందని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (NCPCR) నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సమర్పించిన నివేదికలో అసత్యాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఈ వెబ్‌ సిరీస్‌లో బాలలను అనుచితంగా చిత్రీకరించడాన్ని NCPCR అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రకమైన కంటెంట్ యువతను తప్పుదోవ పట్టించడమే కాకుండా బాలల హక్కులను దుర్వినియోగం చేస్తుందరని కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వెబ్‌ సీరీస్‌లో మైనర్లు మాదకద్రవ్యాలకు అలవాటు పడటంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్టు చూపించారని ఆరోపణలో వచ్చిన నేపథ్యంలో NCPCR నోటీసులు అందజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement