Sunday, May 5, 2024

అదో చెత్త ఫీల్డింగ్..

ఏ జట్టైనా మ్యాచ్ గెలవాలంటే అత్యున్నత ప్రమాణాలతో ఆడాలి. బ్యాటింగ్, బౌలింగ్ సంగతి పక్కన పెడితే ఫీల్డింగ్ అనేది ఎంతో కీ రోల్ ప్లే చేస్తోంది మనకు తెలుసు. క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి కూడా క్రికెట్ లో ఉంది. అయితే, ఓ జట్టు పరమ చెత్త ఫీల్డింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫీల్డింగ్ చిన్న పిల్లల కన్నా మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే.. ఒకే బంతికి మూడు సార్లు ఔటయ్యే అవకాశం చేజారడంతో పాటు ప్రత్యర్థికి అప్పనంగా నాలుగు పరుగులు ఇచ్చేశారు. ఇంత అద్భుతమైన దృశ్యం ఐరోపా క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది.ఈ వీడియోను ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement