Sunday, June 23, 2024

ADB : కుళ్లిపోయిన మృత‌దేహం ల‌భ్యం

(ఆంధ్ర‌ప్ర‌భ‌, భీంపూర్‌) ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండ‌లంలో కుళ్లిపోయిన మృత‌దేహం ల‌భ్యమైంది. త‌మ్సికే స‌మీప రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతంలో ఉద‌యం మేక‌ల కాపురులకు కుళ్లిన మృత‌దేహం కనిపించింది. వెంట‌నే ఈ విష‌యాన్ని వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

- Advertisement -

సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న ఎస్ఐ ప్ర‌దీప్ మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. ఈ మృత‌దేహం నిపాని గ్రామానికి చెందిన పూద‌రి భీమ‌న్న‌గా గుర్తించారు. మృతదేహా సమీపంలో క్రిమిసంహారకమందు కనిపించడంతో మృతుడు పురుగుల మందు తాగి ఉండవచ్చని ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మండల ఎస్సై ప్రదీప్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement