Tuesday, April 30, 2024

మరింత తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. శుక్ర‌వారం ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.291 త‌గ్గి రూ.44,059కు చేరింది. మరోవైపు వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.1,096 త‌గ్గి రూ.65,958కి చేరింది. అటు అంత‌ర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధ‌ర 1,707 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర 25.67 అమెరిక‌న్ డాల‌ర్‌లుగా ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,650, 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,850గా ఉన్నాయి. 2021లో ఇప్పటివరకు బంగారం ధరలు 9 శాతం తగ్గినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement