Tuesday, July 16, 2024

TS: ఇవాళ కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో సీఎం రేవంత్ పర్యటన

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కరీంనగర్‌, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.

- Advertisement -

అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలల్లో హాజరవుతారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement