Thursday, August 5, 2021

రఘురామకు త్వరలోనే నోటీసులు అందుతాయి: ఎంపీ మార్గాని భరత్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై త్వరలోనే అనర్హత వేటు నోటీసులు వస్తాయని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఇప్పటికే రఘురామపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు, తాజాగా 290 పేజీల సమాచారాన్ని ఆయనకు అందజేశారు. దీనిపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వివరించారు. రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని స్పీకర్ కు నివేదించామని, త్వరలోనే రఘురామకు నోటీసులు వస్తాయని వెల్లడించారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని, స్పీకర్ విచక్షణాధికారాల మేరకు వ్యవహరించి రఘురామపై అనర్హత వేటు వేస్తారని భరత్ వెల్లడించారు. రఘురామ వైఖరి పార్టీ అధినేతకు, పార్టీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి: భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News