Friday, April 26, 2024

లాక్ డౌన్ లో పనిమనిషి కొడుకుకు ఇంగ్లీష్ నేర్పిన స్టార్ హీరోయిన్

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో హీరోయిన్స్ చేతికి పని చెబుతూ రకరకాల వంటలు చేస్తూ సమయాన్ని గడిపేశారు. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం వాళ్ల పనిమనిషి అబ్బాయి కి ఇంగ్లీష్ పాఠాలు చెప్పిందట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ… కరోనా విరామ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆన్ లైన్ లో చాలా సబ్జెక్టులలో పరిజ్ఞానం కూడా పెంచుతున్నానని చెప్పుకొచ్చింది.

అలాగే పనిమనిషి అబ్బాయికి ఇంగ్లీష్ పాఠాలు నేర్పించానని పేర్కొంది. ఇక సినిమాల విషయానికొస్తే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు ,నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే ఇండియన్2 లో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement