Wednesday, November 6, 2024

Raashi Khanna | అందాల‌ను రాశీగా పోసి….

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి…. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. కెరీర్‌ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న రాశి ఖన్నా… తక్కువ సమయంలోనే సన్నగా నాజూకుగా ఉండాలని బరువు తగ్గింది.

దాంతో యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈమె సందడి కనిపించడం లేదు. అయినా కూడా భవిష్యత్తులో తిరిగి వరుస సినిమాలు చేయడం ఖాయం అంటూ ఇలాంటి ఫోటోలు చూసిన సమయంలో అనిపిస్తుంది.

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు చీర కట్టులో భలే క్యూట్‌గా ఉంది అంటూ నెటిజన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంటూ ఉంది. అందంతో పాటు అభినయం ఈమె సొంతం. చీర కట్టులో చక్కని క్యూట్‌ అందం ఈమె సొంతం అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement