Wednesday, December 1, 2021

Movie: ఆదిపురుష్ లో.. బాహుబ‌లిని మించిన విజువల్ ఎఫెక్ట్స్..

హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. భారీ ప్రాజెక్ట్ ల‌తో బిజి బిజిగా మారిపోయాడు. స‌లార్..రాధేశ్యామ్ చిత్రాల‌తో పాటు ఆదిపురుష్ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. కాగా రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది ..ఆగష్టు 11న రిలీజ్ కానుంది.

తాజా సమాచారం మేరకు వచ్చే నెలాఖరులోపు ప్రభాస్ పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందట. ఇప్పటికే రావణుడిగా నటిస్తున్న సైఫ్ ఆలీఖాన్, సీతాదేవిగా నటిస్తున్న కృతిస‌న‌న్ పాత్రల షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ రోల్ పూర్తి కాగానే దర్శకుడు విఎఫ్ఎక్స్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. బాహుబ‌లి చిత్రం కంటే మూడు రెట్లు ఎక్కువ‌గా విఎఫ్ ఎక్స్ వ‌ర్క్ ఉండ‌నుంద‌ట‌.

దాదాపు 6 నెలలకు పైగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ కోసం సమయాన్ని కేటాయించబోతున్న‌ట్లు స‌మాచారం. త్రీడీలో కూడా ఆదిపురుష్ చిత్రాన్ని విడుదల చేస్తుండ‌టం విశేషం. రామాయణం పౌరాణిక గాధ నేపథ్యంలో ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాముడిగా ప్ర‌భాస్ లుక్ అదిరిపోనుంద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి విజువ‌ల్ ట్రీట్ మామూలుగా ఉండ‌ద‌ట‌. మ‌రి బాహుబ‌లిలా ఈ చిత్రం ఏమేర‌కు విజ‌య‌వంతం కానుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News