Friday, March 29, 2024

గంజాయి నిర్మూలిద్దాం.. యువతను కాపాడుదాం

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయిని తరిమికొట్టాలని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పిలుపునిచ్చారు. మంగళవారం గంజాయి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా, కలిగి ఉండటం చట్టరీత్యా నేరమన్నారు. గంజాయి నిర్మూలన కు పకడ్బందీ చర్యలు ఉన్నామని, ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. గంజాయి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎక్కడ సరఫరా జరిగిన విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని, అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు తగిన పారితోషకం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్ఐలు రాజేష్, వెంకటేష్, సహదేవ్ సింగ్, రాజ వర్ధన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పోలీసు అమర వీరుల వారోత్సవాలు: ఆయుధాల ప్రదర్శన

Advertisement

తాజా వార్తలు

Advertisement