Wednesday, May 22, 2024

ఓటీటీలోకి మ‌హావీరుడు.. ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ!

తమిళంతోపాటు తెలుగులో మార్కెట్ ఉన్న కొద్ది మంది యాక్ట‌ర్స్‌లో శివకార్తికేయన్ ఒకరు. మడోనా అశ్విన్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ మూవీ మహావీరుడు. తమిళ్ లో మహావీరన్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో రిలీజ్ అయింది. జులై 14న ప్రేక్షకుల ముందుకు సినిమా.. కోలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకోగా.. మనదగ్గర కూడా బాగానే ఆడింది.

ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. ఇందులో సునీల్ కీలకపాత్రలో నటించారు. తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. భారీ ధరకే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, వ‌చ్చే నెల (ఆగస్టు) మెుదటి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement