Saturday, April 27, 2024

MAA ELECTIONS: నామినేష‌న్ వేసిన ప్ర‌కాశ్ రాజ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) ఎన్నికలు ఆసక్తికరంగా మారుతుంది. అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న ‘మా’ ఎన్నికల స‌మ‌రంలో ప్ర‌కాశ్‌రాజ్,మంచు విష్ణు మ‌ధ్యే పోటీ జరగనుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నామినేష‌న్‌ల ప‌ర్వం మొద‌లు కాగా.. మా అధ్యక్షపదవికి ప్ర‌కాశ్ రాజ్ త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ ప్యానల్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేష‌న్స్ ప‌రిశీల‌న 30 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అక్టోబర్‌1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించు కోడానికి గడువు ఉంది. కాగా, అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement