Wednesday, April 24, 2024

“పుష్ప” సెకండ్ సింగిల్ ఎప్పుడంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. సినిమాలోని ఓ సాంగ్ అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ జరుపుకుంది అంటూ ఆ ఫోటోను కూడా షేర్ చేశారు. త్వరలోనే సినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ “దాక్కో దాక్కో మేక”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. క్రిస్మస్ కానుకగా మొదటి భాగం “పుష్ప : ది రైజ్-పార్ట్ 1″ను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: కోడెల పేరుతో నిర్మించిన ఆర్చి ధ్వంసం

Advertisement

తాజా వార్తలు

Advertisement