Tuesday, October 19, 2021

మధ్యాహ్నం 2 గంటలకే అన్ని దుకాణాలు బంద్

నెల్లూరు జిల్లాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో మంగళవారం నుంచి వారంరోజుల పాటు జిల్లాలోని రాపూరు పట్టణంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ విధించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. కాగా గత నెల 19 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు రాపూరులో 63 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణలోకి రావటం లేదు. పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో అన్ని వర్గాల్లో ఆందోళన నెలకొంది. మొన్న కావలి, నిన్న పొదలకూరు, ప్రస్తుతం రాపూరులో పాక్షిక లాక్‌డౌన్‌ను స్థానిక అధికారులు అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News