Friday, April 19, 2024

దిగు దిగు నాగ @ వరుడు కావలెను

ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు నాగశౌర్య. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో 6 వరకు సినిమాలు ఉన్నాయి. అందులో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుడు కావలెను చిత్రం ఒకటి. ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన దిగు దిగు నాగ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్. రేపు ఉదయం 10 గంటలకు ఈ పాట విడుదల కానుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా… శ్రేయ ఘోషల్ పాడారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement