Friday, May 7, 2021

ఆసుపత్రికి కేటీఆర్…కరోనా ఎక్కువైందా ?

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఏప్రిల్ 23న కేటీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే అప్పటి నుంచి కూడా హోమ్ ఐసోలేషన్ లో కేటీఆర్ ఉంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ను శుక్రవారం ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కేటీఆర్ చికిత్స తీసుకుంటున్నారట. ప్రస్తుతానికి కేటీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Prabha News