Thursday, July 29, 2021

నేటి సంపాదకీయం – రెండు ధరలపై సుప్రీం కొరడా

కరోనా వ్యాప్తిని నిరోధించడంలో,వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది.ముఖ్యంగా,కరోనా కట్టడికి అందించే వ్యాక్సిన్‌కు రెండు రకాల ధరలెందుకని సర్వోన్నత న్యాయ స్థానం ప్రశ్నించింది.కరోనా వ్యాక్సిన్‌ ధరలను బాగా ఎక్కువగా ఉండటాన్ని కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం ఇదే విధంగా తప్పుపట్టగా, మన దేశంలో వినియోగంలో ఉన్న కోవీషీల్డ్‌,కోవ్యాక్సిన్‌ సంస్థలు వ్యాక్సిన్‌ ధరలను తగ్గించాయి.ఇప్పుడు కేంద్రానికీ,రాష్ట్రాలకూ సరఫరా చేసే వ్యాక్సిన్‌ ధరల్లో తేడాలెందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కరోనా నిరోధానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై దాఖలయ్యే ప్రజాహిత వ్యాజ్యాలపైనే కాకుండా, మీడియాలో వచ్చిన వార్తలను సూమోటోగా పరిగణించి సుప్రీంకోర్టు కేసుల విచారణను చేపడుతోంది.రాష్ట్రాలతో ప్రమేయం లేకుండా వంద శాతం వ్యాక్సిన్‌ను కేంద్రమే ఎందుకు సరఫరా చేయలే కపోతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.వీటిని గమనించినప్పుడు సుప్రీంకోర్టు కరోనా నివారణకు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్నీ,ప్రతిదశలో అమలవుతున్న చికిత్సా విధానాన్ని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం అవుతోంది.అధికారులు,సిబ్బంది అప్రమ త్తంగా ఉంటున్నా, చాలా చోట్ల ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల, రెమిడెసివేర్‌ ఇంజక్షన్లు లే కపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గమనించింది.అలాగే, ఢిల్లిd, మద్రాసు హైకోర్టులు కూడా కరోనా చికిత్స వ్యాక్సిన్‌,ఆక్సిజన్‌ కొరతలపై తీవ్రమైన వ్యాఖ్యలే చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి.ఆక్సిజన్‌ ట్యాంకర్లను విదేశాల నుంచి,దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆగమేఘాలపై విమానాల్లో తెప్పిస్తున్నా,అవి సకాలంలో ఆస్పత్రులకు చేరడం లేదన్న ఫిర్యాదులను పురస్కరించుకుని వాటికి సంబంధించిన సమాచారం పైన కూడా సుప్రీంకోర్టు ఆరా తీసింది.దేశంలో కోట్లాది మంది నిరక్షరాస్యులకు ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో లేదు.ఈ వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేస్తూ,అలాంటి వారు వ్యాక్సినేషన్‌ కోసం తమ పేర్లను ఆన్‌ లైన్‌లో నమోదు చేసుకోలేరు.వారి కోసం తగిన ఏర్పాట్లు చేశారా అనిప్రశ్నించింది. సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలన్నీ మనందరికీ తెలిసినవే.మన కళ్ళముందు కదలాడు తున్న అంశాలే.అయినా, పౌరుల్లో ప్రశ్నించే స్వభావం బాగా తగ్గిపోయింది.మామూలు రోజుల్లోనే అది అంతంత మాత్రం ఇప్పుడు గడప దాటకుండా రోజు ఎలా గడపాలా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.అలాగే, నిర్విరామంగా కోవిడ్‌ మృతుల శవాలను దహనాలను పర్యవేక్షిస్తున్న కాటికాపరుల పరిస్థితి ఏమిటి? ఈ విషయాన్ని చాలా మందిఆలోచించి ఉండరు.సుప్రీంకోర్టు అలాంటి అట్టడుగు వర్గాలకు అందుతున్న చికిత్స గురించి ప్రశ్నించిందంటే ఈ వై రస్‌ వ్యాప్తి నిరోధానికి సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా మనసు పెట్టిందోఅర్ధంఅవుతోంది.అంతేకాదు,విదేశాల నుంచి, దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వ్యాక్సిన్‌,ఆక్సిజన్‌ నిల్వలను ఎలా భద్రపరు స్తున్నారు? వృధా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వంటి ప్రశ్నలను కూడా సుప్రీంకోర్టు సంధించింది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే ప్రజాప్రతినిధులు,మంత్రులు, ఇతర పార్టీలనాయకులు ప్రజల ఆరోగ్యం గురించి ఇంతటి శ్రద్ధ చూపకపోయినా, సుప్రీంకోర్టు ప్రజల ఆరోగ్యం గురించి ఎంత వ్యధ చెందుతోందో అర్థం చేసుకోవచ్చు.కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ వ్యాక్సిన్‌ ధరల విషయం లోవ్యత్యాసం గురించి వాటిని ఉత్పత్తి చేసే సంస్థలను ముందే ప్రశ్నించింది.అయితే,అవి వాటికున్న కమిట్‌మెంట్లు,ఇతర సమస్యలను ఏకరవుపెట్టాయి. మొత్తానికి ధరలను రెండు సంస్థలూతగ్గించాయి. ఇక రెండురకాల ధరలపై కూడా అత్యున్నత న్యాయస్థానం చేసిన హెచ్చరిక కారణంగా దృష్టి పెడతాయని ఆశిద్దాం. కోవిడ్‌ రెండో దశ విజృంభణ వేళ అమెరికాయే కాకుండా,చైనా కూడామనకు అండగా నిలబడేందుకు ముందుకు రావడం హర్షించదగిన పరిణామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News