Friday, April 26, 2024

కేఆర్‌ఎంబీ భేటీ వాయిదా.. డిసెంబర్‌ 3న చివరి సమావేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణానదీ జలాల వాటాల వివాదం చర్చల ద్వారా పరిష్కారం అవుతుందనే నమ్మకం క్రమేణా సన్నగిల్లుతుంది. తెలంగాణ ఈఎన్‌ సీ మురళీధర్‌ బోర్డుకు అనేకలేఖలు రాసి ఏపీ చేస్తున్న వాదనలను, నిర్మిస్తున్న ప్రాజెక్టులను తప్పుబట్టిన నేపథ్యంలో కెఆర్‌ఎంబీ 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి ఆంధ్ర, తెలంగాణ అధికారులతో గురువారం భేటీ అయ్యేందుకు సమయం కేటాయించింది. అయితే భేటీ కోసం తెలంగాణ అధికారులు సిద్దంగా ఉన్నప్పటికీ ఆంధ్ర అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమై భేటీకిరాలేక పోవడంతో కేఆర్‌ఎంబీ మరో అవకాశం ఇస్తూ డిసెంబర్‌ మూడుకు చర్చలను వాయిదా వేసింది. ఐదు పర్యాయాల చర్చల్లో సమస్యలు పరిష్కరించుకోవాలనే అంగీకారం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో గతంలో కుదిరిందనీ, అయితే నాలుగు పర్యాయాలు జరిగిన సమావేశాల్లో ఎజెండా పక్కకు పెట్టారనీ, వాటాల్లో వాదనలు వినిపించారని అధికారులు చెప్పారు.

5వ పర్యాయం భేటీ అయితే నికరజలాల అంశం పై స్పష్టత వస్తుందని భావిస్తున్న తరుణంలో ఏపీ ఆధికారులు రాలేకపోవడం పై విచారం వ్యక్తం అవుతుంది. ఈసమావేశం ఏజెెండాలో ప్రధాన అంశం జలవిద్యుత్‌ ఉండటంతో ఏపీ నుంచి జన్కో డైరెక్టర్‌ సత్యనారాయణ రావల్సి ఉంది. అయితే ఏపీ పాలనాపరమైన పనుల్లో సమయం దొరకక పోవడంతో రాలేక పోతున్నాని ఆయన కేఆర్‌ఎంబీ కి సమాచారం ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఈ ఎన్‌ సీ నారాయణ రెడ్డి కూడా సమావేశానికి రాలేక పోతున్నానని సమాచారం ఇవ్వడంతో గుకరువారం తెలంగాణ,ఆంధ్ర అధికారుల మధ్య జరగనున్న భేటీ డిసెంబర్‌ 3కు వాయిదా పడింది. ప్రధానంగా ఈ భేటీలో నీటిమట్టాలకొలతలు, జలవిద్యుత్‌ ఉత్పాదన నీటి వనరులు, కృష్ణానజదీ నికర జలాల పంపెిణీ పై చర్చించాల్సి ఉంది.

ఆయితే ఏపీ అధికారులు రాకపోవడంతో సమావేశం వాయిదా పడినా ఇదే ఏజెండాతో డిసెంబర్‌ మూడున భేటీ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. అయితే డిసెంబర్‌ 3న ఇరురాష్ట్రాల ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేకపోయినా కెఆర్‌ఎంబీ నిర్ణయాలు తీసుకుంటుందనీ, నీటివాటాలను ఖరారు చేస్తుందని అధికారులు చెప్పారు. సమావేశాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని కేఆర్‌ఎంబీ చేస్తున్న సూచనలకు తెలంగాణ, ఆంధ్ర ఏమేరకు స్పందిస్తాయో లేదా తిరిగి లేఖలతో ఆరోపణలకు దిగుతాయో వేచిచూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement