Friday, April 26, 2024

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నెంబర్ వన్.. మోడీ

భారత్ డిజిటల్ చెల్లింపుల్లో నంబర్ వన్ గా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వేంట్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొబైల్ డేటా అతి చౌకగా లభించే దేశాల్లో భారత్ ఒకటని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది సివిల్ సర్వీస్ డే చాలా ముఖ్యమైనదని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో బృహత్తరమైన లక్ష్యాలను సాధించేందుకు దేశం వేగంగా అడుగులు వేస్తున్న తరుణమిదేనన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారిని ఉద్దేశిస్తూ.. మీరు ఈ కాలంలో పనిచేస్తుండటం మీ అదృష్టం అని, దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.

సివిల్ సర్వెంట్లు చేస్తున్న కృషిని కొనియాడారు. మన లక్ష్యాలు కష్టతరమైనప్పటికీ, తక్కువ సమయం ఉన్నప్పటికీ తమకు చాలా సామర్థ్యం, ధైర్యం ఉందని ప్రధాని చెప్పారు. గత 9 ఏళ్లలో భారత అభివృద్ధి ఊపందుకుందని, కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని మోడీ అన్నారు. ప్రభుత్వం ప్రతీ వనరుని సద్వినియోగం చేసుకుని సేవ చేయాలనే దృక్పథంతో పనిచేస్తుందన్నారు. తమ మంత్రం ”నేషన్ ఫస్ట్, సిటిజన్ ఫస్ట్’’ అని మోడీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement