Tuesday, May 7, 2024

తవ్వ‌కాలే… వ‌ద్దే వ‌ద్దు – మ‌న్యంలో గిరిజ‌నుల గ‌ళం..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ : పంటపొలాలు నాశనమై పోతున్నాయి.. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఖనిజాల తవ్వకాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు రోడ్డెక్కారు. మన్యం లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న అక్రమ మైనింగ్‌ లీజులను శాశ్వతంగా రద్దు చేసి రక్షణ కల్పించాలని మైనింగ్‌ ప్రభావిత ప్రాంత గిరిజనులు డిమాండ్‌ చేశారు. మైనింగ్‌ తవ్వ కాల కోసం ప్రజాభి ప్రాయసేకరణకు వచ్చిన ఉన్నతాధికార బృందాన్ని చుట్టు-ముట్టారు. మైనింగ్‌ మాకొద్దంటూ వ్యతిరేకించారు. కొండలు తవ్వొద్దు..మా పొట్టలు కొ-్టటొ-ద్దు అంటూ అధికారులను నిలదీశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. వాలసి పంచా యతీ గిరిజనులు అధికారులవద్ద తమ ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనం తగిరి మండలంలో వాలసీ పంచాయితీ పరిధి కరకవలస,రాళ్లగరువు వద్ద సర్వే నెంబర్లు 29,33,34,35లలో దురియ రుక్మిణీ,రొబ్బ శంకర్‌ల పేర్లతో ఉన్న 124 ఎకరాల్లో జరుగుతున్న కాలె్సట్‌ మైనింగ్‌ లీజులపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌, కాలుష్య నియంత్రణ మండలి, ఎపిఎండిసి అధికార్లు నిమ్మలపాడు విచ్చేశారు. అధికార బృందాన్ని మైనింగ్‌ ప్రభావిత గిరిజన గ్రామాలైన వాలాసి పంచాయతీ నిమ్మలపాడు, తూభూర్తి, కరకవలస, రాళ్లవలస గిరిజన ప్రజలు, సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి రెబ్బా ప్రగడ, అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. అక్రమ బినామీ మైనింగ్‌ తవ్వకాలకు ఇచ్చిన లీజులను రద్దు చేయలని ముక్తకంఠంతో నినదించారు. గిరిజనులకు నష్టం కలిగిస్తున్న మైనింగ్‌లు మాకొద్దు అంటూ వ్యతిరేకించారు. 2006 నుండి 2023 వరకు 18 సంవత్స రాల నుంచి బినామీ లీజులతో అక్రమ మైనింగ్‌ తవ్వకాలు చేపట్టి అమాయక గిరిజనుల వనరులను దోచుకుంటు-న్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది బడాబాబులు, కొంతమంది ప్రభుత్వ పెద్దల అండదండలతో మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన చట్టాలు, హక్కులను తుంగలో తొక్కి తమ పంటపొలాల్లో నిక్షేప్తమైన గనులు, ఖనిజాలను తరలించుకుపోతున్నారని,మా అభిప్రాయాలను గౌరవించి అక్రమ మైనింగ్‌లు శాశ్వతంగా రద్ధుచేయలని కోరారు.

తర్వాత నిమ్మలపాడు గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ కరకవలస, రాళ్లగెడ్డలో ఏర్పాటు- చేసిన సభా వేదిక కొనసాగింది. తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌, ఖనిజసంపద కాలుష్య నియంత్రణ అధ్యక్షతన ఏపీఎండిసి అధికారుల బృందం మైనింగ్‌ ప్రభావిత గిరిజన గ్రామాలైన నిమ్మలపాడు,రాళ్లగరువు గ్రామం మైనింగ్‌ ప్రదేశం వద్ద ప్రజాభిప్రాసేకరణ నిర్వహించారు. ఈసభలో కూడా గిరిజ నులు అధికార బృందాన్ని నిలదీశారు. స్థానిక సర్పంచ్‌తో సహా మైనింగ్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆందోళన అనంతరం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో గిరిజనులు ప్రశ్నలవర్షం కురిపించారు. ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు- ప్రజా ప్రతినిధులు,గిరిజనులకు స మాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు అక్రమంగా తవ్వకాలు జరిపిన మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీ లించాలని అధికారులను చుట్టు-ముట్టి నిలదీశారు.

దీంతో జేసీ శివశ్రీనివాస్‌,ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ,స్థానిక తహాసిల్దార్‌,ఏపీఎండీసీ అధికారులను ప్రజాప్రతి నిధు లు,మైనింగ్‌ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శిం చారు. అనంతరం సభావేదికకు వచ్చిన అధికారులు గిరిజన ప్రజలు,స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వేరువేరుగా అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. సభలో సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి మాట్లాడుతూ 1995 నుంచి ఈ ప్రాంతంలో సమత చేపడుతున్న వనరుల పరిరక్షణ ఉద్యమాన్ని అధికారులకు వివరించారు. నిమ్మలపాడు కాల్‌ సైట్‌ మైనింగ్‌ తవ్వకాలు నిర్వహించేందుకు టాటా,బిర్లా అప్పట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదిరించు కుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన సమత సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందని గుర్తుచే శారు. తమకు అనుకూలంగా 1997లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో టాటా,బిర్లా సంస్థలు వెనుక్కు వెళ్లి పోయారని తెలిపారు. ఇదే గతి నేడు ఏపీఎండిసికు కూడా పడుతుం దన్నారు. అనంతగిరిమండల జెడ్పీటీ-సీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ,వాలసి పంచాయతీ తూభుర్తి. కరకవలస, రాళ్లగెడ్డ గ్రామాలకు అనుకొనున్న కాల్సైట్‌ మైనింగ్‌ 2006 సంవత్సరం నుంచి బినామీదారులతో తవ్వకాలు జరుపుతు న్నారన్నారు. బినామీ దారులైన దురియా రుక్మిణి,రొబ్బ శంకరరావులు మైనింగ్‌ కొల్లగొట్టి దోచుకున్నారని విమర్శిం చారు. గ్రామ అభివద్ధి, పనిచేసిన రైతులకు కనీస కూలి చెల్లించకుండా కోట్ల రూపాయలు మైనింగ్‌ మాఫియా దోచుకుందన్నారు. మైనింగ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామ పంచా యతీకి రాయల్టీ చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీఎండిసి పేరుతో బినామీ వ్యవస్థను పెట్టి మైనింగ్‌ తవ్వకాలు జరితే చూస్తూ ఊరుకునేది లేదని,గిరిజనుల పక్షాన అంటూ న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తిగా మైనింగ్‌ లీజు లను రద్దు చేసి గిరిజన భూములు గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


సర్పంచ్‌ సాంబె సన్యాసిరావు మాట్లా డుతూ గ్రామ పంచాయతీ,ప్రజలకు నష్టా నికి గురి చేసే మైనింగ్‌ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఉంటానన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ మాట్లాడారు. గిరిజనులు వెల్లడించిన వారి మనోభావాలు,అభిప్రాయాలను ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement