Monday, July 15, 2024

ఒక్క ఛాన్స్ ప్లీజ్ – గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల‌కు భారీ డిమాండ్

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: తెలంగాణలో అసెంబ్లి ఎన్ని కల సమయం దగ్గర పడు తుంది. కేంద్రం వర్సెస్‌ రాష్ట్రంగా పరిస్థితులు ఉన్నాయి. గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేదన్న అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బీఆర్‌ఎస్‌ బహిరం గంగానే ప్రకటిస్తోంది. ఇప్పుడు త్వరలో ఖాళీ కానున్న రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులపై గులాబీ అధిష్టా నం తీవ్రంగా వడపోత మొదలు పెట్టింది. అయితే శాసన మండలిలో మే 27న గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. క్రిస్టియన్‌ మైనార్టీ నుంచి డి. రాజేశ్వర్‌ రావు, ముస్లిం మైనార్టీ నుంచి ఫారూఖ్‌ హుస్సేన్‌ ఉన్నారు. వీళ్లు ఇద్దరు కూడా మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారే. మూడు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. ఇందులో ఒకరికి మరో అవకాశం ఇస్తారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. మరోవైపు ఆశావాహుల సంఖ్య అధిష్టానానికి తలనొప్పిని తెచ్చి పెడుతున్నా అందరికి సరైన సమయంలో న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా రు. సీఎం కేసీఆర్‌పైనే భారం వేసి పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్నాము.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతా బాగున్నా రెండు ఎమ్మెల్సీ స్థానా ల ఎంపికలో ఆశావాహులను సర్దుబాటు చేసే ప్రయత్నాన్ని సైతం అధిష్టానం చేస్తోంది.

గత పరిణామాలతో ఆచితూచి..
హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత గవర్నర్‌ కోటాలో తెలంగాణ కేబినెట్‌ పాడి కౌశిక్‌ను సిపార్సు చేసింది. ఆ ఫైల్‌ను గవర్నర్‌ తమిళ సై మూడు నెలల పాటు పెండింగ్‌లోనే పెట్టారు. కౌశిక్‌రెడ్డిపై ఉన్న కేసులతోనే గవర్నర్‌ ఆమోదించ లేదన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. గత పరిణామా లను దృష్టిలో పెట్టుకొని గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఆచితూచి వ్యవ హరిస్తున్నారు. అభ్యర్థి ఏ రంగంలో ప్రసిద్ధులు, కేసులు ఉన్నాయా..? అని కూడా ఆరా తీస్తున్నారు. వాటికి సంబం ధించిన వివరాలు సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ సాగుతోంది.

పరిశీలనలో పలువురి పేర్లు
బీఆర్‌ఎస్‌ అధినేత పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొందరి పేర్లు వడపోతలో భాగంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యా వేత్తలకు ఇస్తే అందులో టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, పీఎల్‌ శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపి స్తున్నాయి. బీసీ కోటలో దాసోజు శ్రవణ్‌, బూడిద బిక్షమయ్య గౌడ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోం ది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కోటాలో విద్యార్థి నేతలకు అవ కాశం కల్పించలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండ టంతో వీరికి ఒక్క స్థానం కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన డి.రాజారాం యాదవ్‌, చిరుమల రాకేష్‌, తుంగ బాలు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుం దని, నిరుద్యోగుల సమస్యను తీరుస్తుందని, ఉద్యమంలో పాల్గొన్న స్టూడెంట్స్‌కు న్యాయం చేసినట్లు అవుతందన్న ఆలోచనలో బీఆర్‌ఎస్‌ ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ సైతం ఇందులో కొందరి పేర్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ సాగుతోంది.

విద్యావేత్తలకు…?
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పార్టీకి చేసిన సేవలకు గతంలో సీఎం కేసీఆర్‌ రెండు మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఘంటా చక్రపాణిని అడిగారు. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆసక్తి లేదని తెలపడంతో టీఎస్‌పీఎస్సీ తొలి చైర్మన్‌గా నియమించారు. పదవి ముగిసిన తర్వాత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. మళ్లిd తెరపైకి ఘంటా చక్రపాణి పేరు వచ్చింది. ఇక మరో నేత పీఎల్‌ శ్రీనివాస్‌ సైతం ప్రముఖ విద్యావేత్తగా ఉన్నారు. ఇతని పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement