Wednesday, May 22, 2024

పెరిగిన లగ్జరీ కార్ల అమ్మకాలు

దేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు జనవరి- సెప్టెంబర్‌ కాలంలో భారీగా పెరిగాయి. కొన్ని కంపెనీలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడీ, బీఎండబ్ల్యూ కంపెనీల కార్ల అమ్మకాలు ఈ కాలంలో 30వేల యూనిట్లకు పైగా జరిగాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తంలో వీటి అమ్మకాలు 45,000 నుంచి 47,000కు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనీ 12,768 యూనిట్లను విక్రయించింది.

బీఎండబ్ల్యూ 9,580 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 10 శాతం అమ్మకాలు పెరిగాయి. బీఎండబ్ల్యూ గ్రూప్‌కు చెందిన బీఎండబ్ల్యూ మినీ, బీఎండబ్ల్యూ మెటోరాడ్‌ టూ వీలర్‌ యూనిట్‌ కూడా రికార్డ్‌ అమ్మకాలు జరిపాయి. బీఎండబ్ల్యూ మినీ 582 యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థ అమ్మకాలు కూడా గతంతో పోల్చితే 10 శాతం పెరిగాయి.

ప్రీమియం బైక్‌ బ్రాండ్‌ బీఎండబ్ల్యూ మెటోరాడ్‌ ఈ కాలంలో అమ్మకాలు 26 శాతం పెరిగి 6,778 యూనిట్లగా నమోదయ్యాయి. ఈ ఆర్ధిక సంవత్సరంగా చూస్తే అమ్మకాల పరంగా మొదటి ఆరు నెలల కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న కాలమని బీఎండబ్ల్యూ పేర్కొంది. మూడు త్రైమాసికాల్లోనూ కంపెనీ మెరుగైన ఆర్ధిక ఫలితాలు వెల్లడించింద ని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవ చెప్పారు.

- Advertisement -

ఈ పండగల సీజన్‌లో అమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో బీఎండబ్ల్యూ గ్రూప్‌ మొత్తం 5,867 కార్లును విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే అమ్మకాలు 5 శాతం పెరిగాయి. ప్రీమియం మోటార్‌ సైకిళ్ల అమ్మకాల్లో 50 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 4,667 మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు జరిపింది.

భారత్‌లో రానున్న కాలంలో విక్రయించే ప్రతి 4 కార్లలో ఒకటి విద్యుత్‌ కారు ఉంటుందని ఆయన తెలిపారు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశంలో 1000 విద్యుత్‌ కార్లను కంపెనీ విక్రయించింది. కంపె నీ విద్యుత్‌ కార్ల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ఆయన తెలిపారు.

బీఎండబ్ల్యూ మోటార్‌ సైకిళ్లు జీ 310 ఆర్‌ఆర్‌, జీ 310 జీఎస్‌ అమ్మకాల్లో ముందున్నాయి. గత సంవత్సరం కంటే వీటి అమ్మకాలు 88 శాతం పెరిగాయి. ఆడీ ఇండియా ఈ కాలంఓల మొత్తం 5,530 యూనిట్లను విక్రయించింది. జగ్వార్‌ లాండ్‌ రోవర్‌ 3,000 యూనిట్లను విక్రయించింది. జగ్వార్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే 107 శాతం పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement