Monday, May 13, 2024

రబీ పంటలకు మద్దతు ధర పెంపు.. జాబితాలో కందులు, శెనగలు, పొద్దుతిరుగుడు

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంపుదల చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రబీలో పండించే గోధుమలు, ఆవాలు, బార్లీ, శనగలు, కందులు, పొద్దు తిరుగుడు పంటలపై కనీస మద్దతు ధరలను పెంపుదల చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన నిర్వహించిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) కనీస మద్దతు దరల పెంపుదలపై అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు.

గోధుమలపై క్వింటాకు రూ.110 పెంచిన ప్రభుత్వం ఆవాలపై రూ.400, బార్లీపై రూ.100, శనగలపై రూ.105, కందులపై రూ.500, పొద్దు తిరుగుడుపై రూ.209 పెంపుదల చేసింది. ఏపీలో రైతులు అధికంగా కందులు, శెనగలు పండిస్తున్నారు. పొద్దుతిరుగుడు విస్తీర్ణం కూడా ఏటా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఆయా పంటలు పండిస్తున్న రైతులకు పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడుల నుంచి కొంత ఉపశమనం కలిగింది. ప్రత్యేకించి కందులపై రూ.500 పెంచటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement