Sunday, April 28, 2024

Breaking: భారత 27వ సీజీఏగా భారతీ దాస్​ నియామకం.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగంలో 1988 భారత సివిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారి భారతి దాస్‌ను 27వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA)గా కేంద్రం మంగళవారం ప్రకటించింది. CGA అకౌంటింగ్ విషయాలపై ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా దాస్​ ఉండనున్నరు. ప్రభుత్వ ఖాతాలను నిర్వహించడం, సిద్ధం చేయడంతో పాటు.. CGA అంతర్గత ఆడిట్‌లు.. ఖజానా నియంత్రణను కూడా చేయనున్నారు.

CGA సంస్థ వెబ్‌సైట్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కోసం ఖర్చులు, ఆదాయాలు, రుణాలు.. వివిధ ఆర్థిక సూచికల యొక్క నెలవారీ, వార్షిక విశ్లేషణను నిర్వహిస్తారు. అంతేకాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సాధారణ సూత్రాలు, రూపం.. విధి, విధానాలు కూడా CGA ద్వారా రూపొందిస్తారు. భారతి దాస్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌లో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. హోం మంత్రిత్వ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ (CCA)గా పనిచేశారు.  ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో CCA పదవిని, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.. పోర్ట్, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement