Sunday, April 28, 2024

Fire: కోరుట్ల‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మిల్లు ద‌గ్ధం

జ‌గిత్యాల జిల్లా కోరుట్ల‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. సుఫియాన్ సా మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మిల్లు మొత్తం దగ్ధమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది. షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement