Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 09
09
సంజయ ఉవాచ
ఏవముక్త్వా హృషీకేశం
గుడాకేశ: పరంతప |
న యోత్స్య ఇతి గోవిందమ్‌
ఉక్త్వా తూష్ణీం బభూవ హ ||

తాత్పర్యము : సంజయుడు పలికెను : శత్రువులను అణచివేయగల అర్జునుడు ఆ విధముగా పలికి కృష్ణునితో ”గోవిందా! నేను యుద్ధమును చేయను” అని పలికి మౌనమును వహించెను.

భాష్యము : అర్జునుడు యుద్ధము చేయబోవటం లేదని, భిక్షాటనకే మ్రొగ్గు చూపుచున్నాడని తెలిసికొని ధృతరాష్ట్రుడు ఆనందించి ఉండవచ్చును. ఆ ఆశలపై నీరుపోయునట్లు సంజయుడు ఇక్కడ అర్జునుడిని ‘పరంతప’ అని సంభోదించినాడు. అనతా తాను కృష్ణునికి శరణాగతుడగుట వలన, కృష్ణుడు అతనికి ఆత్మ జ్ఞానమును బోధిస్తాడని, కృష్ణచైతన్య వంతుడిని చేస్తాడని, అంతట అర్జునుడు మోహమును వదిలి తిరిగి యుద్ధము చేసి శత్రువులను జయిస్తాడని సూచిస్తున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement