Sunday, May 12, 2024

విశ్వ‌క్ సేన్ సినిమాకి – ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాప్

ప‌వ‌ర్ స్టార్ ..జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్, సినిమాలు రెండూ చేస్తున్నారు. వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా గడుపుతూనే..సమయం దొరికినపుడు ఇతర సినిమా ఫంక్షన్స్ కు హాజరవుతుంటారు. ఇటీవల నాని ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పవన్ కల్యాణ్..తాజాగా శాండల్ వుడ్ (కన్నడ) యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ముహుర్తం, పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, అర్జున్ కూతురు జంటగా సినిమా తెరకెక్కనుంది.

ఈ పిక్చర్ కు అర్జున్, స్టోరి, స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు దర్శకత్వం వహిస్తూ ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఈ పిక్చర్ కు KGF ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన పూజా కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ నేపథ్యంలో పవన్ అశేష అభిమానులు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా “Power Star” #PawanKalyan హ్యాష్ ట్యాగ్ పవన్ కల్యాణ్ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement