Saturday, December 7, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో – మొక్కలు నాటిన కరణ్ అర్జున్ చిత్ర యూనిట్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ లో మొక్కలు నాటారు కరణ్ అర్జున్ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవట్స ,హీరో అభిమన్యు, నిఖిల్ కుమార్ నటి శైఫా, ఆకుల బాలకృష్ణ, రవి మేకల, ప్రవీణ్ పురోహిత్, అరుణ్ మాధవరం. చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవట్స,నటి శైఫా మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒక మొక్కను నాటితో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతామని అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమం లో అవకాశం కల్పించినందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement