Saturday, April 27, 2024

మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా గాలోడు..ట్రైల‌ర్‌కి అదిరిపోయే రెస్పాన్స్‌…

జబర్థస్త్ షో ద్వారా బాగా పేరు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. కాగా ఆయన నటించిన తాజా చిత్రం గాలోడు.ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నవంబర్ 18న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ గెహనా సిప్పి ) నటించింది. సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గాలోడు ట్రైలర్’ సరికొత్తగా ఉంది. సుధీర్ కేరీర్ కు టర్న్ పాయింట్ దొరికినట్టు అనిపిస్తోంది. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో సుధీర్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ ను బట్టి.. మాస్ అవతార్ లో దుమ్ములేపుతున్నారు. డాన్స్, డైలాగ్స్ తోపాటు యాక్షన్ సీక్వెన్స్ లోనూ అదరగొట్టారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, లోకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా చిత్రంపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ ఉంది.

దాదాపు రెండున్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండ‌బోతుందో ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్.. ఫ‌స్ట్ టైమ్ సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఒక‌వైపు మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటూనే మ‌రోవైపు స్టైలీష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు సుధీర్. ఇక వ‌య‌సు త‌క్కువ షో్‌లు ఎక్కువ‌, నువ్వు శ‌నివారం పుట్టావా? శ‌నిలా త‌గులుకున్నావ్‌, రామాయ‌ణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్క‌డ అంద‌రు మాయ లేడీలే..వంటి డైలాగ్స్‌లో ఎంట‌ర్‌టైన్ చేస్తూనే వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌ర్‌రా వాడు, రాక్ష‌సుల గురించి పుస్త‌కాల్లో చ‌దివాను, విన్నాను మొట్ట‌మొద‌టి సారి వీడిలో చూశాను సార్్‌ వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచానాల్ని రెట్టింపు చేశాయి. గెహ్నాసిప్పి గ్లామ‌ర్‌, స‌ప్త‌గిరి కామెడీ టైమింగ్ ట్రైల‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సి. రాంప్ర‌సాద్ విజువ‌ల్స్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవ‌ల్‌లో ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గాలోడు్‌ సినిమా న‌వంబ‌రు 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement