Tuesday, May 7, 2024

Munugode bypoll : స్ట్రాంగ్‌రూమ్‌ చుట్టూ మూడంచెల భద్రత.. కేంద్ర బలగాల పహారా..

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ నిన్న ముగిసింది. కనీవిని ఎరుగని రీతిలో మునుగోడు ఉప ఎన్నికకు 93.13 శాతం రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. గతంలో 2018 ఎన్నికల్లో 91.38 రికార్డు ఉండగా దాన్ని బ్రేక్‌ చేస్తూ మునుగోడులో పోలింగ్‌ జరిగింది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నేతల్లో టెన్షన్‌ మొదలైంది. పోలింగ్‌ భారీగా నమోదవడంతో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందని చర్చ జరుగుతోంది. దీనిపై బెట్టింగులు కూడా కాస్తున్నారు. అయితే పోలింగ్‌ బూత్‌ నుంచి ఈవీఎంలను ఈరోజు నల్గొండకు తీసుకొచ్చారు. ఆర్జాలబావి గోడౌన్స్‌లో స్ట్రాంగ్‌ రూమ్స్‌కు తరలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలకు కేంద్ర బలగాల పహారా కాస్తున్నాయి. ఈనెల 6న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఉండనుంది. మొత్తం మీద మునుగోడులో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడోనే నరాలు తెగే ఉత్కంఠభరితంగా ప్రజలతోపాటు రాజకీయ పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement