Wednesday, December 4, 2024

Mehbooba Mufti: మాజీ సీఎం ముఫ్తీకి తృటిలో తప్పిన ప్రమాదం

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ‌ ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఆమె క్షేమంగా ఉన్నట్లు కూతురు ఇల్తిజా మీడియాకు తెలియజేశారు.

ఇవాళ‌ మధ్యాహ్నాం అనంత్‌నాగ్‌ జిల్లా సంఘం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ముఫ్తీ ప్రయాణిస్తున్న బ్లాక్‌ కలర్‌ స్కార్పియో వాహనం.. మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమెకు ఏం కాలేదని తెలుస్తోంది. అయితే ఆమెకు భద్రతగా వచ్చిన పోలీస్‌ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఖానాబాల్‌ అగ్నిప్రమాదం బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement