Sunday, April 28, 2024

Kaleswaram – విజిలెన్స్​ కంటిన్యూ! పర్మిషన్లు, ఎస్టిమేట్లపై ఆరా​

కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వరుసగా మూడో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహదేవపూర్‌లో సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీ చేశారు. ఇరిగేషన్‌ డివిజనల్‌ కార్యాలయంలో మేడిగడ్డ బరాజ్‌, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన 46 అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ముఖ్యంగా డీపీఆర్‌ అండ్‌ సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌, సీడబ్ల్యూసీ ఇచ్చిన పంప్‌హౌస్‌, బరాజ్‌ల డ్రాయింగ్‌, డిజైన్‌ వివరాలు, ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ సర్వే వివరాలు తేదీల వారీగా, పంప్‌హౌస్‌ అండ్‌ బరాజ్‌ల ఫౌండేషన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ వివరాలు, సీఈ, సీడీవో అప్రూవల్‌ డిజైన్‌ అండ్‌ డ్రాయింగ్‌, ఎస్టిమేట్‌ అండ్‌ అప్రూవల్‌ వివరాలు, అగ్రిమెంట్‌ కాపీ, బ్యాంకు గ్యా రెంటీస్‌, సప్లిమెంటల్‌ అగ్రిమెంట్‌, మేడిగడ్డ నేషనల్‌ డ్యాం సేఫ్టీ రిపోర్టుపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఇక.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని మూడు ఇరిగేషన్‌ ఆఫీసులు, కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న ఎస్సారెస్పీ క్వార్టర్లలోని ఈఎన్సీ క్యాంప్‌ ఆఫీసులో కూడా విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement