Wednesday, May 22, 2024

ODI World Cup | బోణీకొట్టిన ఇంగ్లండ్‌.. బంగ్లాదేశ్‌పై 137 ప‌రుగుల భారీ విజ‌యం

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్ జ‌ట్టు బోణి కొట్టింది. ధర్మశాల వేదికగా ఇవ్వాల‌ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 365 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

బంగ్లాదేశ్ జట్టులో లిట్టన్ దాస్ (66 బంతుల్లో 76 పరుగులు), ముష్ఫీకర్ రహీమ్ (64 బంతుల్లో 51 పరుగులు) తప్ప మిగతా బ్యాటర్లు చేతులేత్తేశారు. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకి రీస్ టోప్లీ చుక్కలు చూపాడు. 26 పరుగులకే మూడు వికెట్లు తీసి.. ఆ జట్టును కష్టాల్లోకి నెట్టాడు.

- Advertisement -

అంతకుముందు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ రెచ్చిపోయింది.. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్ (107 బంతుల్లో 140 పరుగులు) భారీ సెంచరీతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపాడు.

జో రూట్ (68 బంతుల్లో 82 పరుగులు), జానీ బెయిర్ స్టో (59 బంతుల్లో 52 పరుగులు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బంగ్లా బౌలర్లలో మెహాదీ హసన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. షోరిఫుల్ ఇస్లాం మూడు వికెట్లతో అదరగొట్టాడు. కెప్టెన్ షకీబ్, టస్కిన్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement