Friday, May 3, 2024

TS | హైదరాబాద్​లో 3.35కోట్ల నగదు పట్టివేత.. కారు సీజ్ చేసిన పోలీసులు​

హైదరాబాద్​లో ఇవ్వాల (మంగళవారం) పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో నగదు తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు. 3..35 కోట్ల నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు దొరకడం పెను సంచలనంగా మారింది.

కాగా, చింపి రెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, మందల ఉదయ్ కుమార్ రెడ్డి బంజర హిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా తమ కారులో (3కోట్ల 35 లక్షల) నగదును తీసుకువెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారని డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు. ఆ నగదును స్వాధీనం చేసుకుని, న్యాయస్థానానికి అప్పగిస్తామని డిసిపి తెలిపారు. అంతేకాకుండా నగదు తరలిస్తున్న వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement