Sunday, April 28, 2024

Dubai | జలదిగ్భందంలోనే దుబాయి… హెల్ప్‌లైన్ నెంబర్లు విడుదల

దుబాయ్ లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. ఎవరైనా దుబాయ్‌లో చిక్కుకుపోతే, వారు +971501205172, +971569950590, +971507347676, +971585754213లకు కాల్ చేయవచ్చు అని తెలిపింది.

విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులతో మాట్లాడినట్లు ఎంబ‌సీ తెలిపింది. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు… ప్రయాణికులు భారత్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సౌకర్యాలు కల్పించామని తెలిపింది. దుబాయ్‌లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు హెల్ప్‌లైన్ నంబర్లు తెరిచి ఉంటాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement