Wednesday, May 22, 2024

TS | రేపు మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు, రోడ్ షోలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. అందులో భాగంగా (శుక్రవారం) ఉదయం మహబూబ్ నగర్ లో అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం పాల్గొని కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే సభకు సీఎం బయలుదేరి వెళ్లనున్నారు.

ఇక రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. ఈ నెల 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొననున్నారు. 22న ఉదయం ఆదిలాబాద్ లో జరిగే కాంగ్రెస్ సభలో సీఎం పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement