Wednesday, May 8, 2024

శునకం స్వామి భక్తి ..64 కి.మీ.ల నడకతో యజమాని చెంతకు ….

న్యూఢిల్లి శునకం చూపించే ప్రేమను సృష్టిలో మరే ఇతర జీవి చూపించలే దనే నానుడిని నిజం చేస్తున్నట్టుగా నార్తరన్‌ ఐర్లాండ్‌కు చెందిన కూపర్‌ అనే శునకం తనను దత్తత తీసుకున్న కొత్త యజమానిని కాదని పాత యజమానిని వెదు క్కుంటూ 27 రోజుల్లో 64 కి.మీ.లు ప్రయాణించింది. చివరకు పాత యజమానిని చేరుకుంది. అత్యంత ప్రయాసపడి తనను చేరుకున్న కూపర్‌ను చూసి సంభ్ర మాశ్చర్యాలకు గురికావడం పాత యజమాని వంతైంది. మిస్సింగ్‌ పెట్స్‌ చారిటీ లాస్ట్‌ పాస్‌ ఎన్‌ఐ అనే సంస్థ ప్రతినిధులు చెప్పినదాన్ని బట్టి కూపర్‌ అనే శునకం నార్తరన్‌ ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌లో కొత్త యజమాని ఇంటికి కారులో చేరుకోగానే ఒక్కసారిగా కిందకు దూకేసింది. అప్పటి నుంచి దాదాపుగా నెల రోజు ల పాటు కనిపించకుండా పోయింది. టింబెర్‌మోర్‌లోని కౌంటీ లండన్‌ డెర్రీలో తన పాత యజమానిని కూపర్‌ చేరుకుంది. ఒక శునకం పొలాల్లోనూ, ఇండ్ల చుట్టూ తిరుగుతూ కనిపించిందనే సమాచారం ఏప్రిల్‌ 22న తమకు అందిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత సదరు శునకం తన పాత యజ మాని ఇంటి వైపు పరుగులు పెట్టడాన్ని చూసిన సమాచారాన్ని ఒకతను ఫోన్‌ చేసి తమకు తెలిపాడని వారు చెప్పారు. మనుష్యుల నుంచి ఎలాంటి సాయం లేకుం డానే ఆ శునకం అడవుల్లోనూ, ప్రధాన రహదారులపైన రాత్రి వేళలందు ఒంట రిగా నడుచుకుంటూ ప్రయాణం సాగిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement