Sunday, May 19, 2024

మృత్యు భయాన్ని తొలగించే భాగవతం

భాగవత మహాకావ్యాన్ని రసాత్మకంగా సంస్కృతంలో వ్యాసుడు, తెలుగులో పోతన రచించారు. మూలం కన్నా ఆంధ్రీకరణలో పోతన తన పద్యకావ్యంలో కొన్ని ఘట్టాలను ఎంతో రసరమ్యంగా సాక్షాత్క రించారు.
మహాభారతంలో శ్రీకృష్ణుని పాత్ర అనేక ఘట్టాల్లో ఉంటుందిగానీ ఆయన గూర్చి వివ రంగా ఉండదు. భాగవతంలో శ్రీకృష్ణ జన నం, లీలలు, గోపికల ప్రేమ, కంసవధ, సాం దీపుని ఆశ్రమంలో విద్యాభ్యాసం, జరాసం ధాదుల తో యుద్ధాలు, ద్వారక నగర నిర్మా ణం మొదలైనవి వివరంగా వ్యాసుడు, పోత న తమ కావ్యాలలో ప్రస్తావించారు.
భాగవతమంటే శ్రీకృష్ణ చరితార్థం. దీన్ని మొదటిసారి శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు బోధిస్తాడు. ముని శాపంవల్ల ఏడు రోజుల్లో మహారాజు మరణించనున్నా డు. మరణ భయంతో ఉన్న పరీ క్షిత్‌ ముందు వ్యాసుని కుమారుడు శుకుడు భాగవత పారాయణం చేస్తాడు. దాంతో పరీక్షిత్‌కు మర ణ భయం పోతుంది. సాక్షాత్‌ శ్రీ కృష్ణుల వారికే చావు తప్పలేదని తెలుసుకుని మృత్యు వును ఆనందంగా ఆహ్వానించాడు. అందుకే భాగవతాన్ని పారాయణం చేసినా, విన్నా మరణ భయం ఉండదని మహర్షుల ఉవాచ.
సంస్కృతంలో వ్యాసుడు మహాభార తం, అష్టాదశ పురాణాలు వ్రాసినా ఆయనకు ఏదో అసంతృప్తి కలిగింది. తాను వ్రాసిన వాటితో సంపూర్ణత్వం కలగలేదని భావించా డు. అప్పుడు నారద మహర్షి భాగవతం వ్రాయమని వ్యాసుడికి సలహా ఇచ్చారు. దాంతో ఆయన భాగవత గ్రంథ రచనకు శ్రీ కారం చుట్టారు. వ్యాసుడు వేదాలను నాలు గు భాగాలుగా విభజించి తన శిష్యులు పైలు డు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుల కు బోధించారు. మరో శిష్యునికి 18 పురాణా లు బోధించారు. భాగవతాన్ని తన కుమారు డు శుకునకు బోధించారు. వారు వీటిని తమ తమ శిష్యులకు చెప్పడం… అలా ఆ పరంపర కొనసాగుతూ ప్రజాబాహుళ్యంలోకి వచ్చిం ది. పోతన పండితుడైనా వృత్తి రీత్యా కర్షకు డు. ఆయన తనకు ఉన్న మడ చెక్క (కొద్దిపా టి వ్యవసాయ భూమి)ను స్వయంగా దున్ను కుంటూ పండించుకుంటూ జీవితం గడిపే వారు. శ్రీరామచంద్రుడు ఆదేశం మేరకు భాగవత రచనకు పూనుకున్నాడు. ఆయన పద్యకావ్యం ఎంతో రసరమ్యంగా రూపొం దించారు. భాగవతాన్ని అంకితమివ్వమని ఎందరో రాజులు వత్తిడి తెచ్చినా రామచం ద్రునికే సమర్పించిన మహాభక్తుడు పోతన.
పోతన భాగవతంలో గజేంద్రమోక్షం, రుక్మిణీ కల్యాణం అత్యంత రమణీయ ఘట్టా లు. గజేంద్ర మోక్షంలో సరోవరంలో దిగిన కరి కాలుని మకరం పట్టుకుంటుంది. వీటి మధ్య జరిగిన యుద్ధాన్ని (వేయి సంవత్సరా లు) పోతన వర్ణన అమోఘం. ఆ తర్వాత కరి పూర్తిగా బలహనపడింది. కరి పడే బాధను పోతన వర్ణన అమోఘం. ఆ సమయంలో తనను రక్షించేవాడు కేవలం విశ్వాన్ని పాలిం చే నిరాకారుడైన సర్వ వ్యాపకుడు మాత్రమే అని శరణాగతి చేసి ఆయనను ప్రార్థించాడు. పోతనకు ఆ ఘట్టం ఎలా రాయాలో స్ఫురిం చలేదు. వ్రాయడం ఆపి సంధ్యావందనం చేయడానికి వెళ్లారు. అప్పుడు శ్రీరాముడు పోతన వేషంలో వచ్చి ఆ భాగాన్ని పూర్తి చేసా రు. ‘అలవైకుంఠపురంలో నగిరిలో ఆమూ ల సౌధంబులో’, సిరికిం చెప్పడు, శంఖ చక్ర యుగమున’ వంటి పద్యాలు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు రచించి తన కావ్యా నికి వన్నె తెచ్చారని పోతన చెప్పుకున్నారు. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహత విశ్వనాథ వారు సైతం భాగవతంలో ముఖ్యంగా గజేంద్రమో క్షం, రుక్మిణీ కళ్యాణాలను పోతన మినహా మరెవ్వరు అంత రమ్యంగా వ్రాయలేదని చెప్పడం విశేషం.
రుక్మిణీ కళ్యాణంలో తనను పెళ్లి చేసు కోవాలని తలచిన శిశుపాలుడు నుంచి కాపా డాలని, తాను పెళ్లికూతురుగా గౌరీ ఆలయా నికి వస్తానని రాక్షస వివాహం చేసుకుని తీసుకుపోవాలని పురోహతునితో కబురు పంపుతుంది. ఈ ఘట్టంలో ‘ధీరా కులవతీ కన్యా’, వినుము విదర్భ దేశం వీరుడు, ‘అం గిలి జెప్పలేదు’ వంటి పద్యాలతో పోతన రసజ్ఞులకు విందు గావించారు. గజేంద్రమో క్షంలోని కరిలాగా నమ్మకం తో ఆ దేవదేవుని శరణాగతి కోరితే తప్పక ఆ ఆర్తత్రాణపరా యణుడు వచ్చి భక్తులను ఆదుకుంటాడని పౌరాణికులు చెబుతారు. అలాగే పెళ్లికాని కన్యలు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేస్తే తప్పక వివాహం అవుతుందని నమ్మకం. ఏది ఏమైనా రామాయణ భారతాలకంటే భాగవత పారాయణ సప్తా#హం మోక్షమార్గా నికి దగ్గర చేస్తుంది. మరణభయాన్ని పోగొట్టి అధ్యాత్మిక జీవితానికి బాటలు వేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement