Wednesday, May 8, 2024

విరూపాక్ష‌.. 11వ రోజు వసూళ్ 79.5 కోట్ల గ్రాస్

వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది విరూపాక్ష చిత్రం. ఈచిత్రంలో హీరోగా సాయితేజ్ న‌టించాడు.. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించాడు. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన సినిమా ఇది. అడవికి సమీపంలోని ఒక గ్రామంలో .. క్షుద్రశక్తుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. సాయితేజ్ కెరియర్లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. 4 రోజుల్లో 50 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఈ సినిమా, 11వ రోజు నాటికి 79.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ కావడానికి ఎంతో దూరంలో లేదు. సాయితేజ్ కెరియర్లోనే 100 కోట్లను రాబట్టిన ఫస్టు సినిమాగా ఇది నిలిచిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement