Sunday, May 19, 2024

TS: జోష్ లో కాంగ్రెస్.. దుబ్బాకలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం

రాయపోలు అంబేద్కర్ సెంటర్
నుండి ర్యాలీ, రోడ్ షో.
స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
వినూత్న రీతిలో మత్స్యకారుల ర్యాలీ
దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో
నిర్వహించిన రోడ్ షో ర్యాలీకి హాజరైన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి
నీలం మధును గెలిపించి… రాహుల్ కి గిఫ్ట్ ఇవ్వాలి
కార్నర్ మీటింగ్ లో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి

ఉమ్మడి మెదక్ బ్యూరో : మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారం, రోడ్ షో దుబ్బాక నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. రాయపోలు మండలం అంబేద్కర్ చౌరస్తా నుంచి పలు కాలనీలు, సెంటర్ల మీదుగా రోడ్ షో కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముదిరాజ్ సంఘం, మత్స్యకారులు వినూత్నంగా చేపల వలతో ర్యాలీలో ముందుకు సాగారు. ప్రచార రథంపై దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చేరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. రాయపొల్ కాంగ్రెస్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి, గాల్ రెడ్డి, రాయాపొల్ మండల శాఖ అధ్యక్షుడు సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

నీలం మధును గెలిపించి… రాహుల్ కి గిఫ్ట్ ఇవ్వాలి : మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే.. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించి గిఫ్ట్ ఇవ్వాలని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విజ్ఞప్తి చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో భాగంగా రాయపోల్ కార్నర్ మీటింగ్ లో శ్రీహరి మాట్లాడారు. మన దేశం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ మండుటెండలో దేశమంతా 4500 కిలోమీటర్లు నడిచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఉత్తర భారతదేశంలో జరిగిన లోక్ స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ ఉందని ఇంటెలిజెన్స్, సర్వే రిపోర్ట్ లు చెబుతున్నాయని, రాష్ట్రంలో కూడా ఎంపీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఎలాగైతే దుర్మార్గ పాలనను తుద ముట్టించామో ? ఈ లోక్ స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా ముగించేందుకు శ్రమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలోనే బీసీ యువనేత నీలం మధు ముదిరాజ్ కు మెదక్ లోక్ స‌భ‌ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. 80శాతం మంది ఉన్నామని, అవకాశాలు ఇవ్వడం లేదని ప్రతిసారి వేదికలపై చెబుతుంటాం, కానీ బీసీ బిడ్డ నీలం మధు రూపంలో అవకాశం వచ్చిందని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపిస్తే పార్లమెంటులో వెనుకబడ్డ జాతుల గొంతుక అయి అభివృద్ధికి దోహద పడతాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో కాంగ్రెస్ హామీల అమలుతో పేదలకు మేలు జరిగిందన్నారు. ఎన్నికల తర్వాత దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి తన వంతుగా దోహదపడుతానని తెలిపారు.

ఆలోచించి ఓటెయ్యండి.. ఎంపీ అభ్యర్థి నీలం మధు
రైతుల కన్నీళ్ళకు కారకుడైన వ్యక్తి కావాలో.. ప్రజల కోసమే సేవ చేస్తున్న వ్యక్తి కావాలో ? ఒక్కసారి ఆలోచన చేయాలని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు అన్నారు. రాయపోల్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడారు. గరీబోళ్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. బీజేపీ మాత్రం ఆదానీ, అంబానీల కోసం పనిచేస్తోందన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ధరలు మరింతగా పెరిగిపోతాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించండి.. మెదక్ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని ఎంపీ అభ్యర్థి నీలం మధు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement