Saturday, April 27, 2024

వెండితెరపై దాదా బయోపిక్.. గ్రాండ్​గా నిర్మించిందేందకు ఏర్పాట్లు​

భారత మాజీ కెప్టెన్, BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని అందరూ ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు. దాదా అంటే బెంగాలీ భాషలో అన్నయ్య అని అర్థం. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా గంగూలీ కొనసాగారు. అతను 1996లో ఇంగ్లండ్‌పై టెస్టు ద్వారా అరంగేట్రం చేశారు. వరుసగా రెండు సెంచరీలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. గంగూలీ తన ప్రతిభ, నాయకత్వ లక్షణాల కారణంగా జట్టుకు అత్యుత్తమ ఆటగాడిగా నిలిచారు. గంగూలీ నాయకత్వంలో భారత జట్టు విదేశాల్లో 28టెస్టు మ్యాచ్‌లు ఆడి 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇక.. దీనంటతటినీ దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ నిర్మాత లవ్ రంజన్ ఇప్పుడు గంగూలీ బయోపిక్ నిర్మించడానికి ఆఫర్ ఇచ్చాడు. తాజాగా గంగూలీని వ్యక్తిగతంగా కలుసుకుని ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని, రణ్‌బీర్ కపూర్‌ని ప్రధాన పాత్రలో తీసుకోవాలని గంగూలీ కోరినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement