ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుఫున ఆడుతున్న యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది కాలంగా టీమిండియా తరఫున గిల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌పై 208 పరుగులు చేసి వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఇండియన్ క్రికెట్లో తెండూల్కర్, కోహ్లి అంత పెద్ద స్టార్‌గా ఎదిగే నైపుణ్యం శుభ్‌మన్ గిల్‌కు ఉందని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో 129 పరుగులు చేసి మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో ఇప్పటివరకు 851 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు గిల్. ఇక, రేపు సీఎస్‌కేతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లోనూ ఇదే రీతిలో రాణిస్తే.. ఆరెంజ్ క్యాప్‌తో పాటు గిల్ అరుదైన రికార్డును సొంతం చేసుకునే చాన్స్ ఉంటుంది. ఈ 16వ సీజన్‌లో గిల్ ఇప్పటివరకు 3 సెంచరీలు సాధించాడు. ఆఖరి పోరులో మరోసారి సెంచరీ సాధిస్తే… 4 సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో కింగ్ కోహ్లి (2016), జోస్ బట్లర్ (2022) సరసన చేరుతాడు.

అలాగే.. ఈ యువ ఆటగాడికి మరో రికార్డు కూడా ఉంది. కోహ్లీని అధిగమించే అవకాశం ఉంది. ఒక సీజన్‌లో 900కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 851 పరుగులు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో 49 పరుగులు చేస్తే 900 మార్కును చేరుకుంటాడు. 123 పరుగులు చేస్తే, గిల్ కోహ్లీ (973 పరుగులు) రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. ఇందుకోసం అతను 123 పరుగులు చేయాల్సి ఉంది. మరి, గుజరాత్ జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చిన ఈ స్టార్ క్రికెటర్ తన వ్యక్తిగత రికార్డులను కూడా సవరించుకుని గుజరాత్ టీమ్ కు కప్ అందజేస్తాడో లేదో చూడాలి.