Saturday, April 27, 2024

వారందరికీ కరోనా టీకా

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కరోనా టీకా పంపిణీలో భాగంగా నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్​ అందించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం.

టీకా డోసులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. జనవరి 16 నుంచి ఆరోగ్య, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి, మార్చి 1 నుంచి 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా పంపిణీని ప్రారంభించిన కేంద్రం… నేటి నుంచి 45ఏళ్లు పైబడిన అందరికీ టీకా అందించనుంది. ఇందు కోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 60 ఏళ్లుపైబడిన వారు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 6.30 కోట్ల పైచిలుకు మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement