Friday, April 26, 2024

ఆ దేశంలో కరోనా ఫోర్త్ వేవ్..

పాకిస్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ వీరవిహారం చేస్తోంది. ఆ దేశంలో డెల్టా వేరియంట్ వేగంగా విజృంభిస్తున్న‌ది. దీంతో క‌రోనా నాలుగో వేవ్ గా నిర్థారించింది అక్కడి ప్రభుత్వం. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతుండ‌టంతో పాకిస్థాన్ స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు కొవిడ్-19 ఆప‌రేష‌న్స్‌ కోసం పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ ది నేష‌న‌ల్ క‌మాండ్ అండ్ ఆప‌రేష‌న్ సెంట‌ర్ (NCOC) క‌రోనా క‌ట్ట‌డికి నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆగ‌స్టు 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు ఆంక్ష‌లు కొన‌సాగనున్నాయి. నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఆయా న‌గ‌రాల్లో మార్కెట్‌లు రాత్రి 10 గంట‌ల‌కు బ‌దులుగా 8 గంట‌ల‌కే మూత‌ప‌డ‌నున్నాయి.

అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల్లో 50 శాతం మంది ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ అమ‌ల‌వుతుంది. ప్ర‌జార‌వాణా వాహ‌నాల్లో 50 శాతం మందికే అనుమ‌తి ఉంటుంది. ఇండోర్ డైనింగ్ నిషేధించ‌బ‌డుతుంది. డోర్ డెలివ‌రీ, టేక్ అవేతోపాటు ఔట్ డోర్ డైనింగ్‌కు రాత్రి 10 గంట‌ల వ‌రకు అనుమ‌తి ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఢిల్లీ విమానాశ్రయంలో పీవీ సింధుకు ఘనస్వాగతం..

Advertisement

తాజా వార్తలు

Advertisement