Saturday, April 27, 2024

ముగిసిన హార్ట్ ఏబుల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్.. దివ్యాంగ కళాకారిణి విజయలక్ష్మికి ప్రశంసల వెల్లువ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దివ్యాంగులు అత్మస్తైర్యంతో ముందుకు సాగాలని, తన ప్రతిభతో దేశ రాజధానిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించిన విజయలక్ష్మి ఎంతో మందికి అదర్శమని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రశంసించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సారంగి ఫౌండషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ కళాకారిణి నారా విజయలక్ష్మి వేసిన చిత్రాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం ప్రారంభమైన జాతీయ స్థాయి హార్ట్ ఏబుల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ్ ఉప్పల్ కదల్లేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమైనా తన ఆశలకు రెక్కలు తొడిగి తన కలలకు రంగుల రూపానిచ్చిన విజయలక్ష్మిని అభినందించారు. విజయలక్ష్మి వేసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

కళాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన చెప్పారు. విజయలక్ష్మి వంటి కళాకారులకు సహాయ సహకారాలందిస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి చాటుతున్న సామాజిక కార్యకర్త ఖాజా అఫ్రీది సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకమన్నారు. మూడు రోజుల పాటు సాగిన విజయలక్ష్మి ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తమిళనాడు రైతు సంఘం నేతలు, గాంధీ మెడికల్ కాలేజీ, అర్ట్ కాలేజీ విద్యార్థులు, ఢిల్లీలోని తెలుగు వారితో పాటు ఉత్తరాది వారు సందర్శించారు. విజయలక్ష్మి వేసిన పెయింటింగ్స్ చూసి అబ్బురపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement