Sunday, May 5, 2024

Breaking: సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ఆన్ వ‌ర్కింగ్‌.. సిచ్యుయేష‌న్ నార్మ‌ల్‌, బ‌య‌లుదేరిన గౌత‌మి ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో రైళ్ల రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రించారు. ఉద‌యం నుంచి యువ‌త‌తో అట్టుడికిన రైల్వే స్టేష‌న్‌లో ప్ర‌స్తుతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. స్టేష‌న్‌లోని అన్ని ప్లాట్ ఫాంల‌లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఉద్రిక్త ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గ‌డంతో.. సికింద్రాబాద్‌లోని ఒక‌టో నంబ‌ర్ ప్లాట్ ఫాం నుంచి లింగంప‌ల్లి – కాకినాడ గౌత‌మి ఎక్స్‌ప్రెస్ బ‌య‌లుదేరింది.

ఇంకాసేప‌ట్లో గ‌రీభ్‌ర‌థ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా రానున్న‌ట్టు సికింద్రాబాద్ డివిజన‌ల్ రైల్వే మేనేజ‌ర్ అభ‌య్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అయితే ర‌ద్దు అయిన రైళ్ల‌కు సంబంధించిన ప్ర‌యాణికుల‌కు టికెట్ డ‌బ్బుల‌ను రిఫండ్ చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఉద‌యం 9:15 గంట‌ల‌కు అన్ని రైళ్లు ఆగిపోయాయి. దాదాపు 10 గంట‌ల త‌ర్వాత రైళ్లు పున‌రుద్ధించ‌డంతో ప్ర‌యాణికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement