Saturday, April 27, 2024

Telangana : గుడ్ న్యూస్‌.. మ‌రో 10వేల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ గ్రీన్ సిగ్న‌ల్‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కారు అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులున్నాయి. ఇక బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులకు, టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 995 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement