Friday, April 26, 2024

కరోనా వ్యాక్సిన్ వృథాలో ఐదో స్థానంలో తెలంగాణ

దేశంలో వ్యాక్సిన్ నిల్వలు లేక ప్రజలు టీకాల కోసం కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే పలు రాష్ట్రాల నిర్లక్ష్య ధోరణి కారణంగా అవి వృథా అవుతున్నాయి. దేశంలో 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని సమాచార హక్కు చట్టం నివేదికలో తేలింది. వ్యాక్సిన్లను ఎక్కువగా వేస్ట్ చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, పంజాబ్, హర్యానా, మణిపూర్, తెలంగాణ ఉన్నాయి. ఏప్రిల్ 11 నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేసిన 10.34 కోట్ల వ్యాక్సిన్లలో 44.78 లక్షల (23 శాతం) టీకాలు వృథా అయ్యాయని వెల్లడైంది. కాగా వ్యాక్సిన్ జీరో వేస్టేజీ నమోదైన రాష్ట్రాలలో కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, గోవాలతో పాటు డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement