Friday, April 26, 2024

మంచినీరు కలుషితం కాకుండా చర్యలు..

యైటింక్లయిన్‌కాలనీ: గతకొంతకాలంగా కార్పోరేషన్‌ పరిధిలోని పలు డివిజన్లలో కలుషిత నీరు సరఫరా అవుతుందనే అపోహలు ఉండడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని, ప్రజల ఆరోగ్యం కోసం మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కార్పోరేటర్‌ బదావత్‌ శంకర్‌నాయక్‌ తెలిపారు. 15వ డివిజన్‌లో మున్సిపల్‌ సిబ్బందితో కలిసి నీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేయించారు. ప్రజారోగ్యం కోసం ఎమ్మెల్యే చందర్‌, మేయర్‌ అనిల్‌లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement